Firecrackers Ban | వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. జనవరి ఒకటో తేదీ వరకు బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం విధించింది. ఈ మేరకు పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ ఆదేశాలు జారీ చేశారు. గతేడాది సైతం ప్రభుత్వం ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆన్లైన్లో పటాకుల అమ్మకం, డెలివరీపై సైతం జనవరి 1, 2025 వరకు నిషేధం అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీసులు, డీపీసీసీ, రెవెన్యూ శాఖల సహకారంతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం 21 ఫోకస్ పాయింట్ల ఆధారంగా శీతాకాల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు.