Priyank Kharge : జన గణన నిర్వహించకపోవడం మోదీ ప్రభుత్వ బలహీనతను వెల్లడిస్తోందని కర్నాటక మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే అన్నారు. గణాంకాలు లేకపోవడంతో మోదీ ప్రభుత్వం విధాన వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని దుయ్యబట్టారు. ప్రియాంక్ ఖర్గే సోమవారం బెంగళూర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్డీయే అంటే నో డేటా అవైలబుల్ అని ఆయన అభివర్ణించారు. మరోవైపు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవ్నీత్ బిట్టూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు.
బీజేపీ నేతలు చిత్తశుద్ది కోల్పోయారని తాను భావిస్తు్న్నానని చెప్పారు. రాహుల్ గాంధీకి వేర్పాటువాదులు, ఉగ్రవాదులే వత్తాసు పలుకుతారని బిట్టూ తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తనకు తెలిసినంత వరకూ ఉగ్రవాదులు పార్లమెంట్ సభ్యులు కాలేరని అన్నారు. రాహుల్‌ను విమర్శించాలనుకునే వీరంతా తామే చెడుగా చిత్రీకరింపబడతారని వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ తీవ్రంగా ఖండించారు.
రాహుల్ గాంధీ భారతీయడు కాదని, ఆయన తన జీవితకాలంలో అధిక సమయం విదేశాల్లోనే గడుపుతారని అన్నారు. విదేశీ పర్యటనల్లో భారత్ గురించి తప్పుగా మాట్లాడతారని, ఆయనకు దేశం పట్ల ప్రేమ లేదని దుయ్యబట్టారు.వేర్పాటువాదులు, బాంబులు, తుపాకీలు తయారుచేసేవారు, మోస్ట్ వాంటెడ్ పీపుల్ వంటి మారు మాత్రమే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రశంసిస్తారని ఎద్దేవా చేశారు. విమానాలు, రైళ్లు, రహదారులను తగులబెట్టే దేశ శత్రువులే రాహుల్‌ను సమర్దిస్తారని వ్యాఖ్యానించారు. దేశానికి అతిపెద్ద శత్రువు, నెంబర్ వన్ టెర్రరిస్ట్‌ను ఎవరినైనా పట్టుకోవాలంటే అది రాహుల్ గాంధీ మాత్రమేనని మండిపడ్డారు.
Read More :
Model Schools | అర్బన్‌లో ఫుల్ రూరల్‌లో నిల్.. 17 మాడల్ స్కూళ్లలో టీచర్లు సున్నా