Lok Sabha | 18వ లోక్సభ (Lok Sabha) సమావేశాలు వరుసగా మూడో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమవగానే లోక్సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను మొదలు పెట్టారు. స్పీకర్గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభలో తీర్మానం చేశారు. మోదీ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్ సహా ఇతర మంత్రులు బలపరిచారు. అదేవిధంగా ఇండియా కూటమి తరఫున సురేశ్ అభ్యర్థిత్వాన్ని శివసేన (యుబిటి) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానించారు. అరవింద్ ప్రతిపాదనను విపక్ష ఇండియా కూటమి సభ్యులు బలపరిచారు.
స్పీకర్ పదవికి ఈ సారి ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో గత 50 ఏండ్లలో తొలిసారిగా, స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగనున్నది. మరికాసేపట్లో స్పీకర్ను ఎన్నుకోనున్నారు. ఎన్డీయే కూటమి తరఫున మాజీ స్పీకర్ ఓం బిర్లా పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి తరఫున సీనియర్ ఎంపీ కొడికున్నిల్ సురేశ్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
Prime Minister Narendra Modi moves motion for the election of BJP MP Om Birla as the Speaker of Lok Sabha. pic.twitter.com/QJxKdmlFlL
— ANI (@ANI) June 26, 2024
Also Read..
Lok Sabha Speaker | ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థికి మద్దతు తెలిపిన తృణమూల్
Mukesh Ambani | మహారాష్ట్ర సీఎం షిండేని కలిసిన ముకేశ్ అంబానీ.. కుమారుడి వివాహానికి ఆహ్వానం
Marriage expenses | విద్య కంటే వివాహమే ఘనం.. పెండ్లికి భారీగా ఖర్చు చేస్తున్న భారతీయులు