MSG | మెగాస్టార్ చిరంజీవి హీరోగా, లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద మరోసారి జోరు చూపిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి వారం రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఫెస్టివల్ సీజన్ అడ్వాంటేజ్‌తో పాటు మెగాస్టార్ క్రేజ్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ కలిసి ఈ సినిమాను ప్రారంభ దశలో బ్లాక్‌బస్టర్ రేంజ్లో నడిపించాయి. అయితే సంక్రాంతి వీక్ ముగిసిన తర్వాత రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా వసూళ్ల వేగం కొద్దిగా తగ్గినట్లు కనిపించింది.
సోమవారం మాత్రం బాగానే కలెక్షన్స్ రాగా, ఆ తర్వాత రోజుల్లో గ్రాఫ్ స్వల్పంగా స్లో అయింది. దీంతో సినిమా జోరు తగ్గిందా అనే చర్చలు మొదలయ్యాయి. కానీ తాజా ట్రెండ్స్ చూస్తే ఆ అనుమానాలకు చోటులేదని స్పష్టమవుతోంది. శుక్రవారం సాయంత్రం షోస్ నుంచే ‘మన శంకర వరప్రసాద్ గారు’ మళ్లీ సాలిడ్ జంప్ నమోదు చేసింది. వీకెండ్ అడ్వాంటేజ్‌తో పాటు లాంగ్ వీకెండ్ ఫాక్టర్ కలిసి రావడంతో థియేటర్లలో ప్రేక్షకుల సందడి పెరిగింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, మెగాస్టార్ అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడంతో రాబోయే మూడు నుంచి నాలుగు రోజులు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు కీలకంగా మారనుంది.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ‘వెంకీ మామ’గా చేసిన సాలిడ్ కామియో రోల్ ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరంజీవి–వెంకటేష్ కాంబినేషన్ తెరపై మరోసారి ఫ్యాన్స్‌ను అలరించిందనే మాట వినిపిస్తోంది. అలాగే సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలంగా మారాయి. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయిని పెంచాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, మొదటిసారి నెమ్మదించినట్లు కనిపించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పుడు మళ్లీ పుంజుకుని బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమైందని సినీ వర్గాలు చెబుతున్నాయి.