Marriage expenses | విద్య కంటే వివాహమే ఘనం.. పెండ్లికి భారీగా ఖర్చు చేస్తున్న భారతీయులు
Marriage expenses | భారతీయ సమాజంలో వివాహానికి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. పేదలైనా, ధనికులైనా, మధ్య తరగతి వారైనా ఉన్నంతలో తమ కుమారుడు లేదా కుమార్తె పెండ్లిని ఘనంగా జరపాలని కోరుకుంటారు.
- ఏటా రూ.10.7 లక్షల కోట్ల వ్యయం
- అమెరికన్లు చేస్తున్న ఖర్చు కంటే రెట్టింపు
న్యూఢిల్లీ, జూన్ 25: భారతీయ సమాజంలో వివాహానికి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. పేదలైనా, ధనికులైనా, మధ్య తరగతి వారైనా ఉన్నంతలో తమ కుమారుడు లేదా కుమార్తె పెండ్లిని ఘనంగా జరపాలని కోరుకుంటారు. అప్పు చేసైనా, ఆస్తులు అమ్మైనా పెండ్లి ఖర్చు విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గరు. భారతీయులు వివాహానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నారో జెఫెరీస్ అనే ఒక క్యాపిటల్ మార్కెట్ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. మన దేశంలో పిల్లల చదువుపై పెడుతున్న ఖర్చు కంటే వివాహాలపై రెండింతలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని తేలింది. అందుకే, భారతీయులు ఏటా వివాహాలకు ఖర్చు చేసే మొత్తం అమెరికాలో చేసే ఖర్చు కంటే రెట్టింపు ఉందని ఈ నివేదిక పేర్కొన్నది.
ఏటా రూ.10.7 లక్షల కోట్ల ఖర్చు
భారతీయులు వివాహాల కోసం ఏటా రూ.10.7 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని జెఫెరీస్ నివేదిక తెలిపింది. దేశంలో సగటున ఒక వివాహానికి రూ.12.5 లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఇది దంపతుల ప్రీ-ప్రైమరీ నుంచి డిగ్రీ వరకు చదువుపై చేసే ఖర్చు కంటే రెండింతలు అని పేర్కొన్నది. భారతీయులు సగటున వివాహానికి వెచ్చిస్తున్న మొత్తం మన దేశ తలసరి జీడీపీ(రూ.2.4 లక్షలు) కంటే ఐదు రెట్లు ఎక్కువ. దేశంలో సగటు కుటుంబ వార్షికాదాయం(రూ.4 లక్షలు) కంటే మూడు రెట్లు ఎక్కువ.
అనేక వ్యాపారాలకు ఆధారం
భారత్‌లో వివాహాల సీజన్‌పై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తుంటారు. అనేక చిన్న వ్యాపారాలు, సేవలు అందించే వారు వెడ్డింగ్ సీజన్ కోసం ఎదురుచూస్తుంటారు. మన దేశంలో అమ్ముడవుతున్న మొత్తం ఆభరణాల్లో వివాహ ఆభరణాల వాటానే 50 శాతం ఉంటుందని, మొత్తం వస్ర్తాల అమ్మకాల్లో వివాహ వస్ర్తాల వాటా 10 శాతం ఉంటుందని ఈ నివేదిక లెక్కగట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

