మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 21:32:01

సరోవర్‌ డ్యామ్‌ వద్ద డైనమిక్ లైటింగ్‌ను ప్రారంభించిన మోదీ

సరోవర్‌ డ్యామ్‌ వద్ద డైనమిక్ లైటింగ్‌ను ప్రారంభించిన మోదీ

అహ్మ‌దాబాద్‌: గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ డ్యామ్‌ వద్ద డైనమిక్ లైటింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రెండు రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆ రాష్ట్ర పరిధిలోని పలు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో ఆయన పాల్గొన్నారు. న‌ర్మ‌దా జిల్లాలోని కెవాడియాలో ఆరోగ్య వ‌న్ పార్కును, ఏక్తా మాల్‌ను, చిల్డ్ర‌న్ న్యూట్రిష‌న్ పార్కును రిబ్బ‌న్ క‌ట్ చేసి ప్రారంభించారు. స‌ర్దార్ ప‌టేల్ జూలాజిక‌ల్ పార్కును ప్రారంభించారు. టూరిస్టు వాహ‌నంలో ప్ర‌యాణిస్తూ జూలో జంతువులను వీక్షించారు. ఆ త‌ర్వాత‌ జూపార్కులోని ప‌క్షి ప్ర‌ద‌ర్శ‌న కేంద్రాన్ని ప్ర‌ధాని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొద్ది సేపు రెండు రామ చిలుక‌ల‌తో కాల‌క్షేపం చేశారు.

అనంతరం నర్మదా నదిలోపర్యాటక బోటింగ్‌ను ప్రధాని ప్రారంభించారు. ఐక్యతా విగ్రహం వెబ్‌సైట్,  కెవాడియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభించారు. ఇక రాత్రి వేళ సర్దార్ సరోవర్ డ్యామ్‌ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డైనమిక్ లైటింగ్‌ను ప్రారంభించారు.


కెవాడియా గార్డెన్‌లో యూనిటీ గ్లో గార్డెన్‌ను ఆయన సందర్శించారు. అనంతరం కాక్టస్ గార్డె‌న్‌ను ప్రారంభించారు. చివరగా ఎత్తైన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహాన్ని మోదీ సందర్శించారు. గుజ‌రాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, గవర్నర్ ఆచార్య దేవ్రాత్ కూడా ఉదయం నుంచి ప్రధాని వెంట ఉన్నారు. శ‌నివారం కూడా ప‌లు కార్య‌క్ర‌మాల్లో మోదీ పాల్గొన‌నున్నారు.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.