PM Modi | వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మోదీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు.
PM Modi | లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మోదీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ కంటే ముందు మోదీ గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆయన గంగా హారతి నిర్వహించారు. ప్రధాని మోదీతో పూజారి రామణ్ పూజలు చేయించారు. దేశ సంక్షేమం కోసం గంగా పూజ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మూడవ సారి మోదీ ప్రధాని కావాలని, దేశ ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలని కోరుకున్నట్లు పూజారి రామణ్ వెల్లడించారు.అన్ని దశల ఎన్నికల్లో ప్రధాని మోదీకి ఘన విజయం లభించాలని ఆశీర్వదించినట్లు మరో పూజారి సంతోష్ నారయన్ తెలిపారు. దశాశ్వమేథ ఘాట్‌లో పూజలు నిర్వహించిన తర్వాత.. ప్రధాని మోదీ ప్రత్యేక క్రూయిజ్ బోట్లో విహరించారు. సోమవారం రాత్రి ప్రధాని మోదీ .. కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024
Uttar Pradesh CM Yogi Adityanath is also present on the occasion. pic.twitter.com/woWNPgqdiG
— ANI (@ANI) May 14, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

