SMAT : దేశవాళీ క్రికెట్లో అవినీతికి పాల్పడిన నలుగురిపై వేటు పడింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో అవినీతికి తెరతీసిన వారిని శుక్రవారం అస్సాం క్రికెట్ సంఘం (ACA) సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఏసీఏ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు విచారణ పూర్తయ్యేంతవరకూ ఈ నలుగురు ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లోనూ పాల్గొనవద్దని ఆదేశించింది. అయితే.. ఆ నలుగురు ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమ రాష్ట్ర క్రికెటర్లు అవినీతికి పాల్పడడాన్ని అస్సాం క్రికెట్ సంఘం సీరియస్గా తీసుకుంది. ప్రాథమిక విచారణలో జూనియర్ జట్లకు ప్రాతనిధ్యం వహించే నలుగురికి సంబంధముందనే విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో.. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఏసీఏ ఫిర్యాదు చేశామని ఏసీఏ కార్యదర్శి సనాతన్ దాస్ వెల్లడించారు.
The Assam Cricket Association has suspended four players — Amit Sinha, Ishan Ahmed, Aman Tripathi and Abhishek Thakuri — with immediate effect after allegations emerged that they were involved in corrupt practices. An FIR has been lodged at the Crime Branch, Guwahati, against the… pic.twitter.com/6EyXaB5fps
— Sportstar (@sportstarweb) December 12, 2025
‘అవినీతి ఆరోపణలు మా దృష్టికి రాగానే బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం విచారణ చేపట్టింది. ఏసీఏ సైతం నలుగురు క్రికెటర్ల పాల్పడిన నేరంపై చర్యలకు ఉపక్రమించింది. క్రికెటర్ల ఐక్యతను, ఆటకున్న పేరును చెడకొట్టేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఏసీఏ అవినీతికి పాల్పడిన నలుగురిని సస్పెండ్ చేసింది’ అని సనాతన్ దాస్ పేర్కొన్నారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకూ లక్నో వేదికగా స్మాట్ మ్యాచ్లు జరిగాయి.