Ishan Kishan : భారత జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ (Ishan Kishan) దేశవాళీలో కెప్టెన్‌గా, ఆటగాడిగా అదరగొడుతున్నాడు. ఇషాన్ సారథ్యంలోని జార్ఘండ్ (Jharkhang) టీ20 ఫార్మాట్లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో అజేయ శక్తిగా దూసుకెళ్తోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తున్న ఇషాన్ బృందం శుక్రవారం ఈ లీగ్ చరిత్రలో అత్యధిక ఛేదనతో రికార్డు నెలకొల్పింది. పంజాబ్ నిర్దేశించిన 235 పరుగులను 18.1 ఓవర్లలోనే అందుకొని సరికొత్త అధ్యాయం లిఖించింది జార్ఘండ్.
నిరుడు దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశం వచ్చేసిన ఇషాన్ దేశవాళీ క్రికెట్‌కే పరిమితయ్యాడు. బీసీసీఐ ఆదేశాలను లెక్కచేయక సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఈ యంగ్‌స్టర్.. డొమెస్టిక్‌లో సత్తా చాటి మళ్లీ సీ గ్రేడ్ కాంట్రాక్ట్ సాధించాడు. ఇక మిగిలిందల్లా నీలిరంగు జెర్సీ మళ్లీ ఒంటిపైకి చేరడమే. అందుకని.. పునరాగమనం కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు ఇషాన్. దేశవాళీలో జార్ఘండ్‌కు సారథ్యం వహిస్తున్న ఈ విధ్వంసక ఓపెనర్.. వరుసగా ఎనిమిది విజయాలు కట్టబెట్టాడు.
🚨New Record Alert 🚨
Jharkhand has broken the record of highest run chase ever in Syed Mushtaq Ali Trophy 🤯
Captain Ishan Kishan hit 47 runs in just 23 balls while they chased down 237 runs🙌
Here’s the batting highlights of Kishan…#IshanKishan pic.twitter.com/uVvDbAEKnm— Ayush (@AyushCricket32) December 12, 2025
పుణేలోని డీవై పాటిల్ అకాడమీలో శుక్రవారం పంజాబ్ 236 పరుగులను నిర్దేశించగా.. ఇషాన్ 23 బంతుల్లోనే 47 రన్స్‌తో మెరిశాడు. కుమార్ కుషగ్ర(87 నాటౌట్) అర్ధ శతకంతో విరుచుకుపడగా.. రికార్డు లక్ష్యాన్ని మరో 11 బంతులు ఉండగానే ఛేదించింది. దాంతో.. ఇషాన్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. గత 12 మ్యాచుల్లో 47(23), 2(4), 93(50), 113 నాటౌట్(50), 15(7), 27(24), 53(67), 17(21), 28(41), 45(73), 173(247)తో రాణించాడు. టీ20ల్లో శుభ్‌మన్ గిల్ విఫలమవుతున్న వేళ.. భీకర ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ను తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Ishan Kishan had a potential to become the Indian Travis Head.
– But BCCI ruined his career 💔 pic.twitter.com/jmtPxOptco
— Kshitij (@Kshitij45__) December 12, 2025