ICC : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పురుషుల టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ ఐసీసీ(ICC) కీలక ప్రకటన చేసింది. ఆర్థిక నష్టాల కారణంగా మీడియా ప్రసార హక్కులను జియోస్టార్(JioStar) రద్దు చేసుకోనుందనే వార్తలన్నీ అవాస్తమని ప్రకటించింది. ఐసీసీతో కుదుర్చుకున్ననాలుగేళ్ల ఒప్పందానికి జియోస్టార్ కట్టుబడి ఉందని శుక్రవారం ఇరు సంస్థలు సంయుక్తంగా వెల్లడించాయి. దాంతో.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకూ ఐసీసీ, జియోస్టార్ ఒప్పందంలో ఏ మార్పూ లేదని స్పష్టమైంది.
‘ఐసీసీతో కుదుర్చుకున్న నాలుగేళ్ల ఒప్పందానికి జియోస్టార్ కట్టుబడి ఉంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ సహ ఇతర ఐసీసీ ఈవెంట్లను ఎలాంటి అంతరాయం లేకుండా వరల్డ్ క్లాస్ కవరేజీ ఇవ్వడంపై ఇరుసంస్థలు దృష్టి సారిస్తున్నాయి. కాబట్టి 2027 వరకూ జియోస్టార్ మీడియా హక్కులు కొనసాగుతాయి’ అని జియోస్టార్, ఐసీసీ పేర్కొన్నాయి.
The @ICC and @JioStar reaffirm that their media rights agreement in India remains fully in force.
Details of joint statement: https://t.co/YILwLJORl5 pic.twitter.com/HTdN7y4eCQ
— ICC (@ICC) December 12, 2025
రిలయన్స్ పరిశ్రమలకు చెందిన జియోస్టార్ 2023లో యూఎస్ 3.04 బిలియన్ డాలర్లకు భారత్‌లో ఐసీసీ మీడియా హక్కుదారుగా ఒప్పందం చేసుకుంది. ఈ నాలుగేళ్ల కాలంలో 179 మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్క మ్యాచ్‌కు రూ.138.7 కోట్లకు బిడ్డింగ్ వేసింది జియోస్టార్. వీటిలో టీమిండియా నాకౌట్‌కు వెళ్లితే మొత్తంగా 29 మ్యాచ్‌లు ఆడుతుంది.
అయితే.. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ విలువ మార్కెట్లో రూ.114 కోట్లు ఉంది. దాంతో.. తమకు నష్టాలు వస్తున్నాయని రిలయన్స్ సంస్థ ఐసీసీ మీడియా హక్కులను వదులుకునేందుకు సిద్ధపడింది. మేము కానీ, నాలుగేళ్ల ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై ఐసీసీ – జియోస్టార్ మధ్య చర్చలు ఫలవంతమయ్యాయి. సో.. టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లను జియోస్టార్లోనే అభిమానులు ఎంచక్కా చూసేయొచ్చు. నవంబర్ 25న పూర్తి షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ.. డిసెంబర్ 11 నుంచి మ్యాచ్ టికెట్లను బుక్‌మైషోలో అమ్ముతోంది.