Parliament : శీతాకాల సమావేశాల్లో కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం’ (MG NREGA) పేరు మార్పు ప్రధానమైనది. పేదలకు వంద రోజుల కరువు పని కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకానికి ‘పూజ్య బాపు రోజ్గార్ యోజన’ (Pujya Bapu Rojgar Yojana)గా పేరు మార్చింది. పనిదినాలను 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ పథకం కింద ఒకరోజు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి పెంచింది.
దేశవ్యాప్తంగా జనగణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. రూ.11, 718 కోట్లకు కేంద్ర మంత్రిమండలి అంగీకరించింది. 2027లో రెండు విడతలుగా జనగణన ఫిబ్రవరి నుంచి మొదలు కానుంది. ఇక బీమా రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ శాతం 74గా ఉంది. అంటే.. 26 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్.