MLA Jagadish Reddy : తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి (Chinna Kaparthi) గ్రామంలోని ఓ డ్రైనేజీ కాల్వలో పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు లభ్యమయ్యాయి. అవన్నీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి చెందిన ‘కత్తెర గుర్తు’కు ఓటువేసి ఉన్నవే కావడంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (MLA Jagadish Reddy) కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్స్ దొరికిన స్థలానికి చేరుకున్న జగదీశ్ రెడ్డి ఎన్నికల్లో అవకతవకలపై ఎన్నికల అధికారులకు, పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.
తమ అభ్యర్థునులను రాజకీయంగా ఎదుర్కోలేక, దొంగ దారిలో రిగ్గింగ్ చేశారని కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే మండిపడ్డారు. గులాబీ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఓడిపోయేలా కుతంత్రాలు చేసారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌పై జగదీష్ రెడ్డి ఫైరయ్యారు. ఇలానే చాలా గ్రామాల్లో రిగ్గింగ్ చేసి గెలిచారని కాంగ్రెస్ నాయకులపై ఆయన విమర్శలు గుప్పించారు. బ్యాలెట్ ఓట్లు డ్రైనేజీలో కనిపించిన విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) స్టేజ్ -2 ఆర్వోను సస్పెండ్ చేశారు.