Governors conference | రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అధ్యక్షతన గవర్నర్ల సదస్సు (Governors conference) ప్రారంభమైంది. రెండు రోజుల పాటు (ఇవాళ, రేపు) జరగనున్న ఈ సదస్సును రాష్ట్రపతి భవన్లో ముర్ము శుక్రవారం ప్రారంభించారు. ఈ గవర్నర్ల సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) హాజరయ్యారు. పలువురు కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఈ సదస్సులో కీలక నిర్ణయాలపై చర్చ ఉంటుంది. దేశంలోని పలు కీలక అంశాలపై రెండు రోజులపాటు చర్చలు జరగనున్నాయి. నూతన నేర, న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, గిరిజన ప్రాంతాల అభివద్ధి , వెనుకబడిన జిల్లాలు- సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్రపై వంటి ప్రధాన అంశాలపై చర్చ ఉంటుందని తెలిసింది. ఇక రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక ముర్ము పాల్గొంటున్న మొదటి గవర్నర్ల సదస్సు ఇదేకావడం విశేషం.
Also Read..
Pune | ఇనుప గేటుపడి మూడేళ్ల చిన్నారి మృతి.. షాకింగ్ వీడియో