Pune | మహారాష్ట్ర పూణె (Pune)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై భారీ ఇనుప గేటు (Iron Gate) పడింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
పూణెలోని పింప్రి – చించ్వాడ్ (Pimpri-Chinchwad) ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి తోటి స్నేహితులతో కలిసి వీధిలో ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు గేటు తీసుకుని ఇంటి లోపలికి వెళ్తారు. అనంతరం గేటును వేయగా.. అదే సమయంలో అక్కడికి వచ్చిన మూడేళ్ల చిన్నారిపై ఇనుప గేటు ఒక్కసారిగా పడుతుంది (Iron Gate Falls). దీంతో భయాందోళనకు గురైన ఇతర పిల్లలు అక్కడినుంచి పరుగులు తీస్తారు.
ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతి చెందిన చిన్నారిని గిరిజా గణేష్ షిండేగా గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ శివాని పవార్ తెలిపారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వీధిలోని ఓ ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
A 3-year-old girl was tragically crushed to death when an iron gate fell on her in Pimpri-Chinchwad, Pune. The accident was recorded on CCTV. #Pune #PimpriChinchwad #BreakingNews pic.twitter.com/2Fnwt0BobY
— Glint Insights Media (@GlintInsights) August 2, 2024
Also Read..
Hoarding Collapsed | థానేలో కూలిన హోర్డింగ్.. వాహనాలు ధ్వంసం
Swapnil Kusale | ఒలింపిక్స్‌లో కాంస్యం ముద్దాడిన యువ షూటర్ స్వప్నిల్‌కు లోక్‌సభ అభినందనలు
Intel lays off | ఉద్యోగులకు షాకిచ్చిన టెక్ దిగ్గజం ఇంటెల్.. 18 వేల మందిపై వేటు