Hoarding Collapsed | మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి థానే (Thane) జిల్లాలో ఓ హోర్డింగ్ కూలింది (Hoarding Collapsed). ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
కల్యాణ్ (Kalyan) ప్రాంతంలో శుక్రవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ రద్దీగా ఉండే సహజానంద్ చౌక్ (Sahajanand Chowk) వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఒక్కసారిగా కూలి వాహనాలపై పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. హోర్డింగ్ కూలిన సమయంలో అక్కడ కొందరు వ్యక్తులు కూడా ఉన్నట్లు వీడియోలో కనిపించింది. అయితే, వారి పరిస్థితి గురించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
#WATCH | Maharashtra: A wooden hoarding collapsed at Sahajanand Chowk of Kalyan in Thane at 10:18 am this morning. No casualties reported, 3 vehicles were damaged in the incident.
(Source: District Information Officer, Thane) pic.twitter.com/daMjcqFhOi
— ANI (@ANI) August 2, 2024
Also Read..
Intel lays off | ఉద్యోగులకు షాకిచ్చిన టెక్ దిగ్గజం ఇంటెల్.. 18 వేల మందిపై వేటు
Swapnil Kusale | ఒలింపిక్స్‌లో కాంస్యం ముద్దాడిన యువ షూటర్ స్వప్నిల్‌కు లోక్‌సభ అభినందనలు
Wayanad | 300 దాటిన వయనాడ్ మృతులు.. ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు