Droupadi Murmu | రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో పర్యటిస్తున్నారు. అక్కడ జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న ముర్ము.. అక్కడ త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన విషయం తెలిసిందే. తాజాగా హనుమాన్ ఆలయాన్ని (Hanumanji Temple) సందర్శించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముర్ము వెంట యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ (Anandiben Patel), సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తదితర అధికారులు ఉన్నారు.
ఇవాళ ఉదయం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము అక్కడి నుంచి మహాకుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. త్రివేణీ సంగమ (Triveni Sangam) ప్రాంతంలో పడవలో విహరించారు. ఈ సందర్భంగా సంగమం వద్ద వలస పక్షులకు ఆహారం అందించారు. అనంతరం గంగా, యమునా, సర్వసతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం (holy dip) ఆచరించి గంగమ్మకు ప్రార్థనలు చేశారు.
Prayagraj, UP: President Droupadi Murmu offered prayers at Lete Hanumanji Temple. CM Yogi Adityanath and Governor Anandiben Patel were also present.
Source: Information Department pic.twitter.com/10KWMiW0gd
— ANI (@ANI) February 10, 2025
Also Read..
Sheesh Mahal | శీష్ మహల్‌కు దూరంగానే బీజేపీ సీఎం..!
Woman Dies | స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో కుప్పకూలిన యువతి.. షాకింగ్ వీడియో
Bomb threat | అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..!