Sheesh Mahal | ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో 26 ఏళ్ల తర్వాత హస్తిన కాషాయ వశం అయ్యింది. త్వరలోనే ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా (BJP Delhi CM) బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి శీష్ మహల్ (Sheesh Mahal)లో నివాసం ఉండకపోవచ్చని తెలిసింది. వివాదాస్పద శీష్ మహల్‌కు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పని చేసిన సమయంలో సివిల్ లైన్స్‌లో ఆయన అధికారిక నివాసం ఏర్పరుచుకున్నారు. అయితే, ఆ నివాసాన్ని బీజేపీ ‘శీష్ మహల్’గా అభివర్ణిస్తోంది. ఢిల్లీ సీఎం అధికార నివాసాన్ని దాదాపు రూ.80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు ఆరోపిస్తోంది. తమ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశాన్ని ఆయుధంలా వాడుకుంది. ఈ బంగ్లాను పునరుద్ధరించడంలో పెద్ద స్కామ్ జరిగిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఈ అంశం ఢిల్లీ ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆప్ ఓటమికి ఇది కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి కాబోయే బీజేపీ సీఎం ఈ ‘అద్దాల మేడ’లో నివాసం ఉండరని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. శీష్ మహల్‌కు బీజేపీ సీఎం దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నాయి.
ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మనీశ్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ వంటి కీలక నేతలు సైతం ఓటమి పాలవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కీలక నేతల్లో ఆప్ సీఎం ఆతిశీ ఒక్కరే గెలుపొందడం కాస్త ఊరటనిచ్చింది.
Also Read..
Woman Dies | స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో కుప్పకూలిన యువతి.. షాకింగ్ వీడియో
Ayodhya Ram Mandir | ప్రయాగ్‌రాజ్ టూ అయోధ్య.. బాల రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు..