బుధవారం 27 జనవరి 2021
National - Nov 25, 2020 , 17:58:14

ఉద్య‌మిస్తున్న రైతుల‌పై జ‌ల‌ఫిరంగుల ప్ర‌యోగం.. వీడియో

ఉద్య‌మిస్తున్న రైతుల‌పై జ‌ల‌ఫిరంగుల ప్ర‌యోగం.. వీడియో

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల చేసిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్న రైతుల‌పై హ‌ర్యానా ప్ర‌భుత్వం దౌర్జ‌న్యానికి పాల్ప‌డింది. ఢిల్లీలో ఆందోళ‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌డం కోసం హ‌ర్యానాలోని కురుక్షేత్ర‌లో భారీ సంఖ్య‌లో పోగైన రైతుల‌పై పోలీసులు జ‌ల‌ఫిరంగులు ప్ర‌యోగించారు. ఢిల్లీ వైపు వెళ్ల‌కుండా వారిని అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌కు, రైతుల‌కు మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. వ్య‌వ‌సాయ బిల్లుల‌కు వ్య‌తిరేకంగా హ‌ర్యానా రైతులు ఢిల్లీలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఆ మేర‌కు కురుక్షేత్ర‌లో పోగై ర్యాలీగా ఢిల్లీకి బ‌య‌లుదేరాల‌ని భావించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకోవ‌డంతో అక్క‌డ‌ ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo