Narendra Modi | బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని, భారతరత్న ఎల్కే అద్వానీ (LK Advani)ని నరేంద్ర మోదీ (Narendra Modi) కలిశారు. ఎన్డీయే పార్లమెంటరీ నేతగా ఎన్నికైన సందర్భంగా అద్వానీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సమావేశం అనంతరం నేరుగా అద్వానీ ఇంటికి వెళ్లిన మోదీ.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టబోతున్నందుకు మోదీకి అద్వానీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురూ కాసేపు మాట్లాడుకున్నారు. మరోవైపు దేశానికి అద్వానీ అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవలే భారతరత్న (Bharat Ratna)తో సత్కరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అద్వానీ విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. అద్వానీతో మీటింగ్ అనంతరం మోదీ.. మురళీ మనోహర్ జోషీ (Murli Manohar Joshi) ఇంటికి వెళ్లి ఆయన్ని కూడా కలిశారు.
#WATCH | PM Narendra Modi meets Bharat Ratna and veteran BJP leader LK Advani at the latter’s residence in Delhi. pic.twitter.com/fZtIlOj5yw
— ANI (@ANI) June 7, 2024
ఎన్డీయే పక్ష నేత (parliamentary party leader)గా నరేంద్ర మోదీ (Narendra Modi) ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే కూటమి సమావేశం (NDA Meeting)లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎన్డీయే కూటమి నేతలు మోదీని మూడోసారి ఎన్డీయే పక్షనేతగా ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. ఇక ఈనెల 9వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
#WATCH | PM Narendra Modi meets veteran BJP leader Murli Manohar Joshi at the latter’s residence, in Delhi pic.twitter.com/7yuTbEZB54
— ANI (@ANI) June 7, 2024
Also Read..
PM Modi: ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం
Narendra Modi | ఎన్డీయే పక్షనేతగా మూడోసారి ఏకగ్రీవ ఎన్నిక.. సంతోషం వ్యక్తం చేసిన మోదీ
Narendra Modi | ఎన్డీయే పక్షనేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. పార్లమెంట్ వెలుపల కార్యకర్తల సంబరాలు