Narendra Modi | ఎన్డీయే పక్ష నేత (parliamentary party leader)గా నరేంద్ర మోదీ (Narendra Modi) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే కూటమి సమావేశం (NDA Meeting)లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎన్డీయే కూటమి నేతలు మోదీని మూడోసారి ఎన్డీయే పక్షనేతగా ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
మోదీ (PM Modi) నాయకత్వాన్ని సమర్థిస్తూ బీజేపీ ఎంపీ రాజ్‌నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఎన్డీయే లోక్‌సభా పక్ష నేతగా మోదీ పేరును ప్రతిపాదించారు. రాజ్‌నాథ్ ప్రతిపాదనను అమిత్ షా, గడ్కరీ, చంద్రబాబు, నితీశ్ కుమార్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, కుమారస్వామి తదితరులు బలపరిచారు. దీంతో ఎన్డీయే పక్షనేతగా మోదీ ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం ఎన్డీయే కూటమి పార్టీల నేతలంతా మోదీకి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు.
#WATCH | Delhi: Leaders of NDA allies garland Narendra Modi. He has been elected as Leader of the BJP, Leader of NDA Parliamentary Party and Leader of the Lok Sabha. pic.twitter.com/9omLVvPqm1
— ANI (@ANI) June 7, 2024
అనంతరం మోదీ ప్రసంగించారు. ఎన్డీయే పక్షనేతగా ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎన్డీయే పక్ష నేతగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. నాపై విశ్వాసం ఉంచి ఎన్డీయే నేతగా ఎన్నుకున్నారు. దేశానికి ఇంకా సేవచేసే భాగ్యం లభించింది. 22 రాష్ట్రాల్లో ఎన్డీయేకు ప్రజలు అధికారం ఇచ్చారు. ఎన్నికలకు ముందే ఏర్పడే కూటమి.. ఎన్డీయేలాగా ఎన్నడూ విజయవంతం కాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ అవసరం. కానీ ప్రభుత్వం నడపటానికి అందరి సహకారం అవసరం. అందుకే అందరి సహకారంతో ముందుకెళ్తాం’ అని మోదీ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే విజయానికి కార్యకర్తలే కారణమన్నారు. రాత్రింబవళ్ల కష్టానికి ఫలితం దక్కిందన్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని, మండే ఎండలను అధిగమించి పనిచేశారని కొనియాడారు. మిత్రపక్షాల కార్యకర్తలకు ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని మోదీ పేర్కొన్నారు.
#WATCH | At the NDA Parliamentary Party meeting, Prime Minister Narendra Modi says “I express my heartfelt gratitude to all the leaders of the constituent parties present in this assembly hall, all the newly elected MPs and our Rajya Sabha MPs. It is a matter of happiness for me… pic.twitter.com/yBDoHmDsZF
— ANI (@ANI) June 7, 2024
#WATCH | At the NDA Parliamentary Party meeting, Prime Minister Narendra Modi says “I am very fortunate that all of have unanimously chosen me as the leader of NDA. You all have given me a new responsibility and I am very grateful to you…When I was speaking in this House in… pic.twitter.com/cpzNQnc3B2
— ANI (@ANI) June 7, 2024
#WATCH | Prime Minister Narendra Modi says, “Very few people discuss this, perhaps it doesn’t suit them. But look at the strength of the great democracy of India – today, people have given NDA the opportunity to form a government and serve in 22 states.” pic.twitter.com/jB7f6uITST
— ANI (@ANI) June 7, 2024
Also Read..
PM Modi: ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం
Rahul Gandhi | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్