PM Kisan Samman Nidhi | రైతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుభవార్త చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద 20వ విడత (PM Kisan 20th installment) నిధులను శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. వారణాసి (Varanasi)లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ (PM Kisan Samman Nidhi) కింద రైతులకు పెట్టుబడి సాయం నిధులను విడుదల చేశారు. మొత్తం రూ. 20,500 కోట్లను రైతుల (farmers) ఖాతాల్లోకి జమచేశారు. దీని ద్వారా మొత్తం 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
కాగా, ప్రధాన్‌మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 19వ విడత నిధులను ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 9.8 కోట్లమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.22 వేల కోట్లకుపైగా నిధులను జమచేశారు. బీహార్‌లోని భాగల్పూర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధులను విడుదల చేశారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులకు ఏటా ఒక్కోవిడత రూ.2వేల చొప్పున మూడు విడతల్లో రూ.6వేల సాయం అందనుంది. ఇప్పటివరకు 11 కోట్ల మంది రైతులకు 19 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లు అందజేసింది.
#WATCH | Varanasi: PM Narendra Modi credits the 20th instalment of PM Kisan Samman Nidhi, an amount of more than Rs 20000 crores, into the bank accounts of 9.7 crore farmers.
Source: DD pic.twitter.com/7ULjd6flPv
— ANI (@ANI) August 2, 2025
Also Read..
Nobel Peace Prize | ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా..? భారత్ సమాధానం ఇదే
IndiGo | విమానంలో వ్యక్తి హల్చల్.. తోటి ప్రయాణికుడి చెంప చెళ్లుమనిపించి.. VIDEO
Dead Economy | భారత్‌ది డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు.. AI ఏం సమాధానం చెప్పిందంటే..?