PM Modi : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం యూపీలోని అమ్రోహలో జరిగిన ర్యాలీలో విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లను ఉద్దేశించి గతంలో ఇద్దరు యువరాజులు నటించిన సినిమాను ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు.
ఎన్నికలు జరిగిన ప్రతిసారీ యూపీలో ప్రజలను వీరు బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాల మాటున ఓట్లు అడిగేందుకు వస్తారని విమర్శించారు. ప్రచారంలో వీరు మన మతవిశ్వాసాలను దెబ్బతీసేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోరని ఆరోపించారు.
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి భారత్ మాతాకీ జై అనేందుకు కూడా ఇబ్బంది పడతారని అన్నారు. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్టకు ఆహ్వానం పంపితే కాంగ్రెస్, ఎస్పీ తిరస్కరించాయని గుర్తుచేశారు. వీరు ప్రతిరోజూ రామాలయాన్ని, సనాతన ధర్మాన్ని నిందిస్తారని దుయ్యబట్టారు. రామభక్తులను ఎస్పీ బాహాటంగా కపటులని పిలిచిందని మోదీ ఆరోపించారు.
Read More :
SSMB29 | ఎయిర్‌పోర్టులో జక్కన్న, మహేశ్‌బాబు.. ఎస్ఎస్ఎంబీ 29 క్రేజీ అప్డేట్ గురూ