PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 2023లో ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక ఘర్షణల తర్వాత మోదీ ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మణిపూర్ పర్యటనపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. ఘర్షణలు చోటు చేసుకున్న రెండేండ్ల తర్వాత రాష్ట్రంలో మోదీ పర్యటించడం దురదృష్టకరమన్నారు.
వయనాడ్ పర్యటనలో ఉన్న ప్రియాంక గాంధీ అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో ఘర్షణలు జరిగిన రెండేండ్ల తర్వాత ప్రధాని మోదీ అక్కడ పర్యటించడం దురదృష్టకరం. ఆయన ఇప్పటికే అక్కడ పర్యటించి ఉండాల్సింది. భారత్‌లోని ప్రధానమంత్రుల (Prime Ministers) సంప్రదాయం ఇది కాదు. ఏ పార్టీకి చెందిన వారైనా సరే.. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు ప్రధానులు వెంటనే అక్కడికి వెళ్తారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అందరు ప్రధానులు ఇదే విధానాన్ని పాటించారు. కానీ, మోదీ మాత్రం రెండేండ్ల తర్వాత ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
#WATCH | Wayanad, Kerala: On PM Modi’s visit to Manipur, Congress MP Priyanka Gandhi Vadra says, “I am glad that he has decided after 2 years that it’s worth his visiting. He should have visited much long before. It’s very unfortunate that he has allowed what is happening there… pic.twitter.com/0h8i9WUe7E
— ANI (@ANI) September 13, 2025
Also Read..
CM Mohan Yadav | హాట్ఎయిర్ బెలూన్‌కు మంటలు.. సీఎంకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. VIDEO
Mangaluru: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో 51 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష