CM Mohan Yadav | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (CM Mohan Yadav)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కబోయిన ఓ హాట్ ఎయిర్ బెలూన్ (Hot Air Balloon)కు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సీఎం మోహన్ యాదవ్ శుక్రవారం సాయంత్రం గాంధీ సాగర్ ఉత్సవాన్ని (Gandhisagar Festival) ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కేందుకు వెళ్లారు. ఉదయం 7 గంటల సమయంలో భద్రతా సిబ్బందితో కలిసి హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కారు. బలమైన గాలుల కారణంగా బెలూన్ ఎగరలేకపోయింది. అంతేకాదు, సీఎం ఎక్కబోయిన బెలూన్ కింది భాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించారు. అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
मंदसौर में जिस हॉट एयर बैलून में सीएम मोहन यादव थे उसी में भड़की आग. सुरक्षाकर्मियों ने सुरक्षित बाहर निकाला…! pic.twitter.com/X1InpZilUY
— Rupesh Mishra (@rupeshmishramp) September 13, 2025
Also Read..
PM Modi | మణిపూర్ చేరుకున్న ప్రధాని మోదీ.. రెండేండ్ల తర్వాత తొలిసారి
PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కికి మోదీ శుభాకాంక్షలు