PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) చేరుకున్నారు. శనివారం ఉదయం మిజోరం పర్యటనకు వెళ్లిన ప్రధాని.. అక్కడి నుంచి ఇవాళ మధ్యాహ్నం మణిపూర్ వెళ్లారు. రాజధాని ఇంపాల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. 2023లో ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక ఘర్షణల తర్వాత మోదీ ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ప్రధానికి గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పునీత్ కుమార్ గోయెల్ స్వాగతం పలికారు.
ఇంపాల్ నుంచి ప్రధాని చురాచాంద్‌పుర్ (Churachandpur) వెళ్లనున్నారు. అక్కడ సుమారు రూ.7,300 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. మణిపూర్ అర్బన్ రోడ్స్, డ్రైనేజీ, అసెట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కోసం రూ.3,600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రూ.2,500 ఖర్చుతో అయిదు జాతీయ రహదారులు నిర్మించనున్నారు. మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, 9 ప్రదేశాల్లో వర్కింగ్ వుమెన్స్ హాస్టల్స్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించనున్నారు. ఇంపాల్‌లో సుమారు రూ,1200 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు.
కాగా, కుకి, మైతీ వర్గాల మధ్య జాతి ఘర్షషణలు తలెత్తిన (Manipur violence) విషయం తెలిసిందే. మే 2023లో ప్రారంభమైన ఈ హింసలో దాదాపు 260 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘర్షణల తర్వాత ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన దృష్ట్యా మణిపూర్ ప్రభుత్వం భద్రత కట్టుదిట్టం చేసింది. మరోవైపు ప్రధానికి వెల్కమ్ చెబుతూ ఇంపాల్ (Imphal)లో పోస్టర్లను ఏర్పాటు చేశారు.
STORY | PM Modi reaches Manipur on his first visit after ethnic violence broke out in 2023
Prime Minister Narendra Modi reached Imphal on Saturday on his first visit to Manipur after ethnic violence broke out in May 2023. Modi was received at the Imphal airport by Governor Ajay… pic.twitter.com/W4VvnAOfiD
— Press Trust of India (@PTI_News) September 13, 2025
Also Read..
Ganesh Visarjan | భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కికి మోదీ శుభాకాంక్షలు
Road Blockade Case | రోడ్డు దిగ్బంధించారని.. కేంద్ర మాజీ మంత్రి సహా 14 మందికి రెండేండ్ల జైలు శిక్ష