– నల్లగొండ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈఓ రాజశేఖర్
కట్టంగూర్, ఫిబ్రవరి 24 : గ్రామాల్లో ఏర్పాటు చేసే ఉచిత పశువైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈఓ రాజశేఖర్ అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని భాస్కరబాయి గ్రామంలో పశు సంవర్ధక శాఖ, పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ ఎన్న మౌనికా వెంకట్ రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రైతులు అధిక పాల దిగుబడినిచ్చే మేలు జాతి దూడలను పొంది ఆర్థికంగా ఎదగాలన్నారు. కృత్రిమ గర్భధారణతో పుట్టిన దూడలు కేవలం మూడు సంవత్సరాలు పెంచితే లక్ష విలువైన గేదెలుగా మారుతాయన్నారు. పశువులకు వచ్చే వ్యాధులను గుర్తించి వెంటనే పశు వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం రైతులకు క్యాల్షియం, మినరల్ మిక్సర్ ప్యాకెట్లు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారిణి రవి, మాజీ సర్పంచ్ ఎన్న నర్సిరెడ్డి, సూపర్ వైజర్ బండ సాయి, గోపాలమిత్రలు చెరుకు శ్రీనివాస్, కావటి యాదగిరి, వార్డు సభ్యులు శేఖర్, పశువైద్య సిబ్బంది పజ్జారి రేణుక. రైతులు బుచ్చిరెడ్డి. మాధవరెడ్డి పాల్గొన్నారు.