Williams Sisters : ఒకప్పుడు మహిళల టెన్నిస్‌ను ఏలిన ‘విలియమ్స్ సిస్టర్స్’ (Williams Sisters) మళ్లీ జోడీ కడుతున్నారు. కోర్టులోకి దిగారంటే తిరుగులేని ఆధిపత్యంతో రికార్డులు బద్ధలుకొట్టే సెరీనా విలియమ్స్, వీనస్ విలియమ్స్‌లు నాలుగేళ్ల తర్వాత డబుల్స్‌లో జంటగా ఆడబోతున్నారు. త్వరలో జరుగనున్న సిన్సినాటి ఓపెన్‌లో ఈ అమెరికా నల్లకలువలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది.
సింగిల్స్, డబుల్స్ ఏదైనా.. టైటిల్ మాదే అన్నట్టు చెలరేగి ఆడే విలియన్స్ సిస్టర్స్ మళ్లీ జంటగా అభిమానులను అలరించనున్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత వీరిద్దరూ మహిళల డబుల్స్‌లో ప్రత్యర్థుల భరతం పట్టేందుకు వస్తున్నారు.
వింబుల్డన్ గ్రాండ్స్లామ్తోనే ఇద్దరూ అక్కాచెళ్లెల్లు కలిసి ఆడాలని భావించారు. కానీ, అవకాశం చేజారింది. ఇప్పుడు సిన్సినాటి ఓపెన్‌లో వీరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. ఆగస్టు 8వ తేదీన ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇదివరకూ 2022 యూఎస్ ఓపెన్‌లో చివరిసారిగా కలిసి ఆడారీ వెటరన్ సిస్టర్స్. గతంలో డబుల్స్ జోడీగా వీరు 14 టైటిళ్లు సాధించిన విషయం తెలిసిందే.
The last time Serena and Venus Williams played doubles together was at the 2022 US Open…
…nearly four years later, the superstar sisters will reunite on the court at the Cincinnati Open 🤝 pic.twitter.com/PYpYmWGNB9
— TNT Sports (@tntsports) August 4, 2026