AjithKumar | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరియు దర్శకుడు శివ కాంబినేషన్ అనగానే అభిమానులకు ముందుగా గుర్తోచ్చేది. ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి భారీ చిత్రాలు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ మంచి సక్సెస్‌ను సాధించాయి. అయితే బాక్సాఫీస్ సక్సెస్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా వీరి ఐదవ కలయిక కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు శివ ఈ క్రేజీ అప్డేట్ను అధికారికంగా ధృవీకరించారు.
ఇటీవల ‘కంగువ’ సినిమాతో నిరాశలోకి వెళ్లిపోయిన శివ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అజిత్ కుమార్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ ఉండబోతుందని తెలిపాడు. ఇప్పటికే అజిత్ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశానని, ఆయనకు కూడా ఈ లైన్ బాగా నచ్చిందని శివ తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం అజిత్ కుమార్ తన రేసింగ్‌లో బిజీగా ఉండగా.. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కాంబో పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది.