Ganesh Visarjan | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. హసన్ (Hassan) జిల్లాలోని ఓ గ్రామంలో గణేష్ నిమజ్జన (Ganesh Visarjan) ఊరేగింపుపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసలే హోసహల్లి గ్రామంలో గణేష్ చతుర్థి (Ganesha Chaturthi) వేడుకల చివరి రోజైన శుక్రవారం రాత్రి 8:45 గంటల సమయంలో గణేష్ నిమజ్జన వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో అరకలగూడు నుంచి వస్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 20 మందికిపైగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన అధికారులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
Also Read..
PM Modi | నేడు మణిపూర్ పర్యటనకు ప్రధాని మోదీ.. ఈశాన్య రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం
PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కికి మోదీ శుభాకాంక్షలు
Road Blockade Case | రోడ్డు దిగ్బంధించారని.. కేంద్ర మాజీ మంత్రి సహా 14 మందికి రెండేండ్ల జైలు శిక్ష