శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 10:38:41

27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ

27న ముఖ్యమంత్రులతో  ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ  భారీగా పెరిగిపోతున్న  నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ   అన్ని రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో   సమావేశంకానున్నారు.   ఈనెల 27న  ముఖ్యమంత్రులతో  వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా  మాట్లాడనున్నారు.    దేశంలో కరోనాపరిస్థితి,   వైరస్‌ నియంత్రణ చర్యలు,  బాధితులకు అందుతున్న వైద్యసేవలు,   అన్‌లాక్‌ 3.0పై చర్చించనున్నట్లు తెలిసింది. చివరిసారిగా జూన్‌ 16, 17 తేదీల్లో సీఎంలతో మోదీ సమావేశమయ్యారు.   కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో  మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి. logo