PM Modi | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Attack) నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవాల్తో వరుసగా సమావేశాలు అవుతున్నారు. తాజాగా మోదీ నేతృత్వంలో రేపు కీలక భేటీ జరగనుంది.
దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) బుధవారం సమావేశం కానుంది. దీనికి ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అధ్యక్షత వహించనున్నారు. పెహల్గామ్ ఘటన తర్వాత సీసీఎస్ భేటీ కావడం ఇది రెండోసారి. ఘటన జరిగిన వెంటనే ఈ కమిటీ ఒకసారి భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత , దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసా రద్దు తదితర నిర్ణయాలు తీసుకుంది. రేపు జరగబోయే భేటీలో మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీసీఏ భేటీ తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA) కూడా సమావేశం కానుంది. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ సహా పలువురు సీనియర్ మంత్రులు ఉన్నారు.
Also Read..
X account withheld | భారత్‌లో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత
Supreme Court | జాతి వ్యతిరేక శక్తులపై ‘స్పైవేర్’ తప్పు కాదు.. పెగాసస్‌పై సుప్రీంకోర్టు