PM Modi | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవాల్, హోంమంత్రి అమిత్‌షాతో వరుసగా సమావేశాలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో పెహల్గామ్ దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) నేడు ప్రత్యేకంగా సమావేశం కానున్నది.
ఈ భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఉగ్రదాడి ఘటన తర్వాత సీసీఎస్ భేటీ కావడం ఇది రెండోసారి. ఘటన జరిగిన వెంటనే ఈ కమిటీ ఒకసారి భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత , దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసా రద్దు తదితర నిర్ణయాలు తీసుకుంది. తాజా భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీసీఏ భేటీ తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA) కూడా సమావేశం కానుంది. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ సహా పలువురు సీనియర్ మంత్రులు ఉన్నారు.
Also Read..
PM Modi | సింహాచలం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన