Pahalgam Attack | పాకిస్తాన్‌పై భారతదేశం యుద్ధం చేయబోతుందని పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 24-36 గంటల్లో పాకిస్తాన్‌పై భారతదేశం దాడి చేస్తుందని.. సైనిక చర్యకు ప్రణాళిక రూపొందించినట్లుగా విశ్వసనీయ సమాచారం ఉందని సమాచార మంత్రి అతుల్లా తరార్ పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం త్రివిధ దళాలతో కీలక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సాయుధ దళాల సామర్థ్యంపై ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారత సైన్యం తమపై దాడి చేయబోతుందనే భయాందోళనలకు గురవుతున్నది. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రేమం ఉందనే నిరాధార ఆరోపణలతో సైనిక చర్య తీసుకునేందుకు భారత్ సిద్ధమవుతోందని పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల్లా తరార్ పేర్కొన్నారు. పాకిస్తాన్ సైతం ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని పేర్కొన్నారు. పహల్గాం దాడిలో నిజానిజాలను తెలుసుకునేందుకు ఇస్లామాబాద్ నిపుణుల కమిషన్ ద్వారా విశ్వసనీయమైన, పారదర్శకమైన స్వతంత్ర దర్యాప్తునకు ప్రతిపాదించిందని.. భారత్ ఇందుకు అంగీకరించలేదన్నారు. భారత్ కావాలనే యుద్ధం చేస్తుందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం అత్యున్నత రక్షణ అధికారులతో సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ సైతం పాల్గొన్నారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. ఉగ్రవాదాన్ని అంతమొందించడతమే మన జాతీయ సంకల్పమని ప్రధాని పేర్కొన్నారు. సాయుధ దళాల సామర్థ్యాలపై ప్రధాని మోదీ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదం అణచివేతలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యాచరణను రూపొందించుకోవడంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ఎప్పుడు.. ఎలా స్పందించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ సైన్యానికి ఉందని చెప్పారు. పహల్గాం దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను వేటాడి ఊహకు అందని విధంగా శిక్షిస్తామన్నారు. భారతదేశం ఉగ్రవాదులను.. వారి మద్దతుదారులను గుర్తించి, శిక్షిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ఉగ్రవాదులను భారతదేశం తరిమికొడుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు దిగింది. దాడి జరిగిన మరుసటి రోజు కేబినెట్ భద్రతా కమిటీ (CCS) సమావేశం కూడా జరిగింది. ఈ భేటీలో జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని.. రాష్ట్రం నెమ్మదిగా ఆర్థిక పురోగతి వైపు పయనిస్తున్న సమయంలో దాడి జరిగినట్లుగా పేర్కొన్నారు. ఈ సమావేశంలోపై ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జల ఒప్పందాన్ని వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అట్టారి చెక్‌పోస్ట్‌ను మూసివేయడం, సార్క్ వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పాకిస్తాన్ హైకమిషన్‌లో నియమించిన రక్షణ, సైనిక, నావికాదళ, వైమానిక దళ సలహాదారులను వారంలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.
Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24-36 hours on the pretext of baseless and concocted allegations of involvement in the Pahalgam incident.
Indian self assumed hubristic role of Judge, Jury and… pic.twitter.com/WVW6yhxTJ0— Attaullah Tarar (@TararAttaullah) April 29, 2025