PM Modi | ఏపీ విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి (Simhachalam temple) చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడకూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున అందజేయనున్నట్లు వెల్లడించారు.
PMO tweets, “Deeply saddened by the loss of lives due to the collapse of a wall in Visakhapatnam, Andhra Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon. An ex-gratia of Rs 2 lakh from PMNRF would be given to the next of kin of each… pic.twitter.com/rWIdifXqyF
— ANI (@ANI) April 30, 2025
అక్షయ తృతీయ సందర్భంగా సింహాచలం వరాహా లక్ష్మీనరసింహస్వామి భక్తులకు నిజరూపంలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం ఆ తర్వాత స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరు చేసి.. నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు జరిపారు. స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు తరలివచ్చిన రాత్రి భక్తులు అక్కడే బస చేశారు. బుధవారం వేకువ జామున 2.30 గంటల ప్రాంతంలో నిద్రిస్తున్న భక్తులపై గోడ కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు.
Also Read..
CM Chandrababu Naidu | సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
Simhachalam | సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి.. గోడ కూలడంతో ఎనిమిది మంది భక్తులు మృతి
Srisailam | ఆగమ విద్యను మరింత సాధన చేయాలి : ఈవో శ్రీనివాసరావు