PM Modi : అయోధ్యలో ఈనెల 22న రామాలయం ప్రారంభోత్సవ వేడుకల రోజున ప్రజలందరూ తమ ఇండ్లలో జ్యోతిని వెలిగించాలని, రామ జ్యోతితో తమ జీవితాల్లో పేదరికం తొలగిపోయేందుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. దేశంలో ఎన్నో ఏండ్ల కిందటే గరీబీ హఠావో నినాదాలు వినిపించినా పేదరికం మాత్రం తొలగిపోలేదని అన్నారు. ప్రధాని శుక్రవారం షోలాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
అయోధ్యలో నూతన రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టతో దశాబ్ధాల పాటు అనుభవించిన వేదన సమసిపోయిందని అన్నారు. గతంలో భక్తులు టెంట్ నుంచి రామ్ లల్లా దర్శనం చేసుకునేవారని చెప్పారు. అయోధ్యలో దివ్యభవ్య రామాలయ నిర్మాణంతో భక్తుల చిరకాల స్వప్నం నెరవేరిందని మోదీ పేర్కొన్నారు. ఇక అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం ప్రారంభోత్సవానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు.
నిత్యం రాముడి ( Lord Ram) కీర్తనలు వింటూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలో రాముడికి అంకితం చేసిన సుమారు 62 భక్తి గీతాలతో కూడిన ప్లేలిస్ట్‌ను ప్రధాని తన అధికారిక ఎక్స్ ఖాతాలో శుక్రవారం షేర్ చేశారు. ప్లేలిస్ట్‌తో పాటు.. రామాయణ సందేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చిందంటూ భజన కీర్తనలకు ( Ram bhajan) సంబధించిన వీడియో లింక్స్‌ను కూడా నెట్టింట పోస్టు చేశారు.
Read More :
Republic Day parade: ఆర్డీ పరేడ్‌లో 51 విమానాలతో ప్రదర్శన