న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో భాగంగా ఢిల్లీలో జరగనున్న ఆర్డీ పరేడ్( Republic Day parade)లో మొత్తం 51 విమానాలతో ప్రదర్శన ఇవ్వనున్నారు. దీంట్లో 29 ఫైటర్ విమానాలు, 8 ట్రాన్స్‌పోర్టు విమానాలు, 13 హెలికాప్టర్లు ఉంటాయని ఐఏఎఫ్ వింగ్ కమాండర్ మనిశ్ తెలిపారు. ఈసారి తొలిసారి సీ-295 కార్గో విమానాన్ని కూడా షోలో ప్రదర్శించనున్నారు. 1971 యుద్ధానికి చెందిన తంగలి ఎయిర్డ్రా ఈవెంట్‌ను ప్రదర్శనలో ఐఏఎఫ్ చూపెట్టనున్నది. ఒక డకోటా ఎయిర్‌క్రాఫ్ట్, రెండు డార్నియర్లతో ఈ షో నిర్వహిస్తారు.
మహిళా ఫైటర్ పైలెట్లు కూడా ఈసారి షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పీఆర్వో వింగ్ కమాండర్ ఆశిశ్ మొఘే తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలతో పాటు ఈసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన శకటం పరేడ్‌లో పాల్గొంటుందన్నారు. 48 మంది మహిళా అగ్నివీరులు కూడా పరేడ్‌లో పాల్గొననున్నారు.