Loksabha Elections 2024 : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తూ దేశంలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. సీఏఏ కింద శరణార్ధులకు భారత పౌరసత్వం మంజూరు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని అన్నారు. ప్రధాని మోదీ గురువారం ఆజంఘర్లో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
మతం ఆధారంగా దేశ విభజన జరిగిన కారణంగా వీరంతా దీర్ఘకాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి భారత పౌరసత్వం అందచేస్తామని చెప్పారు. మహాత్మా గాంధీ పేరు చెప్పుకుని అందలమెక్కిన కాంగ్రెస్ నేతలు ఆపై గాంధీ చెప్పిన మాటలను పెడచెవిన పెట్టారని మోదీ ఆరోపించారు. పొరుగు దేశాల్లో నివసించే మైనారిటీలు తాము ఎప్పుడు కోరకుంటే అప్పుడు భారత్కు రావచ్చని గాంధీ చెప్పారని గుర్తుచేశారు.
తమ సంస్కృతి, మతాన్ని పరిరక్షించుకునేందుకు గత 70 ఏండ్లుగా వేలాది కుటుంబాలు భారత్లో ఆశ్రయం పొందాయని అన్నారు. వీరు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాకపోవడంతో ఆ పార్టీ నేతలు వీరిని ఎన్నడూ చేరదీయలేదని మోదీ దుయ్యబట్టారు. సీఏఏపై ఎస్పీ, కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమి అసత్యాలు ప్రచారం చేస్తూ దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.
Read More :
Conjoined Twins: 4 చేతులు, 3 కాళ్లతో అరుదైన అవిభక్త కవలలు జననం