Conjoined Twins: 4 చేతులు, 3 కాళ్లతో అరుదైన అవిభక్త కవలలు జననం
Conjoined Twins: 4 చేతులు, 3 కాళ్లతో అవిభక్త కవలలు జన్మించారు. ఇండోనేషియాలో ఆ సోదరులు పుట్టినట్లు అమెరికా జర్నల్ పేర్కొన్నది. ప్రస్తుతం ఆ కవలలకు ఓ కాలును తొలగించారు. అయితే కవలల్ని వేరు చేసేందుకు సర్జరీ చేస్తారా లేదా అన్న విషయం ఇంకా తెలియదు.
న్యూఢిల్లీ: ఇండోనేషియాలో అవిభక్త కవలలు(Conjoined Twins) జన్మించారు. ఆ ఇద్దరికీ నాలుగు చేతులు, మూడు కాళ్లు, ఒక జననాంగం ఉన్నది. 20 లక్షల మందిలో ఒకరు ఇలా పుడుతారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ అవిభక్త కవలల్ని శాస్త్రీయంగా ఇషియోఫాగస్ ట్రిపస్ అని పిలుస్తారు. ఇలా పుట్టడాన్ని స్పైడర్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు. ఈ కవలల గురించి తాజాగా అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు.
వాస్తవానికి ఈ పిల్లలు 2018లోనే జన్మించారు. కానీ ఇటీవల రిలీజైన జర్నల్‌లో వారి గురించి రాశారు. ఇషియోఫాగస్ ట్రిపస్ అవిభక్త కవలల్ని సర్జరీ ద్వారా వేరు చేయడం చాలా కష్టం. ఇలాంటి కవలల్లో దిగువ శరీరా భాగం అతుక్కుని పుడుతారు. వీరిలో మొండాలు వేరుగా ఉంటాయి. దాదాపు 60 శాతం కేసుల్లో ఎవరో ఒక పిల్లాడు చనిపోతుంటారు. కానీ ఈ కేసులో ఆ సోదరులు ఇద్దరూ బ్రతికే ఉన్నారు.
మొదటి మూడు ఏళ్లు వాళ్లు ఫ్లాట్‌గా కిందనే నిద్రపోయేవారు. బాడీ స్ట్రక్చర్ సరిగా లేకపోవడం వల్ల వాళ్లు కూర్చునేవాళ్లు కాదు. అయితే ఓ సర్జరీ ద్వారా మూడవ కాలును తీసివేశారు. దాంతో వాళ్ల తొడలు, కాళ్లకు బలం వచ్చి ఇప్పుడు స్వంతంగా కూర్చోగలుగుతున్నారు. కాలు సర్జరీ జరిగిన మూడు నెలల తర్వాత కూడా వాళ్లు ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు.
ప్రస్తుతం ఇంకా ఆ కవలలు కలిసే ఉన్నారు. వాళ్లను వేరు చేసేందుకు ఏదైనా సర్జరీ చేస్తారా లేదా అన్న విషయాన్ని ఇంకా డాక్టర్లు నిర్ధారించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

