న్యూఢిల్లీ: జలియన్ వాలాబాగ్ మారణకాండలో అమరులైన వారికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. వారి త్యాగాలు ప్రతి భారతీయుడిలోనూ శక్తిని నింపుతాయని పేర్కొన్నారు. జలియన్‌వాలా బాగ్ నరమేధం జరిగి నేటికి సరిగ్గా 102 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. ‘జలియన్ వాలాబాగ్ దురంతంలో అమరులైన వారికి నా నివాళులు. వారి ధైర్యం, సాహసం, త్యాగం ప్రతి భారతీయ పౌరునిలో శక్తిని పెంపొందిస్తాయి’ అని ట్వీట్టర్లో పేర్కొన్నారు.
అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ట్విట్టర్ వేదికగా జలియన్‌వాలా బాగ్ అమరవీరులకు నివాళి అర్పించారు. ‘అమరులకు నా నివాళులు. ఎన్నేండ్లు గడిచినా ఆ చేదు ఘటన ప్రతి ఒక్క భారతీయుడి గుండెలో మెదులుతుంటుంది. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది’ అని వెంకయ్య ట్వీట్ చేశారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ్ ఏప్రిల్ 13, 1919లో జరిగింది.
బ్రిటిష్ పాలకులు తెచ్చిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టిన సఫియుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ అనే ఇద్దరు నాయకుల్ని అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో వైశాఖి పర్వదినం రోజున ప్రజలు జలియన్ వాలాబాగ్‌లో భారీగా సమావేశమయ్యారు. వారిపై జనరల్ డయ్యర్ కాల్పులకు ఆదేశించడంతో బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఆ కాల్పుల్లో 500 మందికిపైగా మరణించినట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి.
Tributes to those martyred in the Jallianwala Bagh massacre. Their courage, heroism and sacrifice gives strength to every Indian.
— Narendra Modi (@narendramodi) April 13, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!