PM Modi | పాక్‌పై ప్రతీకార చర్యల వేళ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో (President Droupadi Murmu) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan)కు చేరుకున్న మోదీ.. ముర్ముతో సమావేశమయ్యారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి వివరించారు. సరిహద్దు వద్ద తాజా పరిస్థితి, ప్రభుత్వ చర్యలను రాష్ట్రపతి ముర్ముకు వివరించారు.
#WATCH | PM Modi heads to Rashtrapati Bhawan to brief President Droupadi Murmu on #OperationSindoor pic.twitter.com/JWmatVcJho
— ANI (@ANI) May 7, 2025
పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్.. అందుకు ప్రతీకారం తీర్చుకుంది. పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసింది. ముఖ్యంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 80 మంది వరకూ ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం మొత్తం హతమైంది. ఆయన కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు సహాయకులు, పలువురు సన్నిహితులు కూడా మరణించినట్లు సమాచారం.
Also Read..
All Party Meet | ఆపరేషన్ సిందూర్.. రేపు ఆల్ పార్టీ మీటింగ్
Foreign Media | ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయ మీడియా ఆసక్తి
Jaish-e chief | ఆపరేషన్ సిందూర్.. జైషే చీఫ్ మసూద్ కుటుంబం హతం