నాగపూర్: వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) తన పవర్ స్ట్రోక్స్‌తో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఆ కుర్రాడు ఇంకా సీనియర్ మెన్స్ క్రికెట్లోకి అడుగుపెట్టలేదు. కానీ అతను కొడుతున్న షాట్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి. చాలా పవర్‌తో అతను స్ట్రోక్స్ రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా ముగిసిన అండర్19 వరల్డ్‌కప్‌లో తన గేమ్‌తో బెంబేలెత్తించాడు. ఫైనల్లో ఏకంగా ఇంగ్లండ్‌పై 175 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఆ యువ సెన్షేషన్ రాబోయే ఐపీఎల్ కోసం ప్రిపేరవుతున్నాడు. నాగపూర్‌లోని రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
గురువారం ప్రాక్టీస్ సెషన్లో ఓ ఘటన చోటుచేసుకున్నది. బ్యాటింగ్ చేస్తున్న వైభవ్.. ఎప్పటి తరహాలోనే భారీ షాట్ ఆడాడు. స్క్వేర్ లెగ్ దిశగా పవర్ఫుల్ పుల్ షాట్ బాదాడు. వైభవ కండ బలానికి ఆ బంతి చాలా దూరం ప్రయాణించింది. ఓ బిల్డింగ్ మీదున్న నీళ్ల పైప్‌ను ఆ బంతి తాకడంతో ఆ పైప్ పగిలిపోయింది. ఆ పైప్ నుంచి నీరు కారుతున్న దృశ్యానికి చెందిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసింది. తమ ఎక్స్ అకౌంట్లో ఆ టీమ్ పోస్టు చేసింది. సూర్యవంశీ చేష్టలివన్నీ అంటూ ఓ కామెంట్ ట్యాగ్ చేసింది.
just sooryavanshi things 😅 pic.twitter.com/HtP8p5KjlQ
— Rajasthan Royals (@rajasthanroyals) February 19, 2026