Foreign Media | పెహల్గామ్ ఉగ్రదాడికి పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులు చేసింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసింది. పాక్ ఆర్మీ, పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా దాడి చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. జైషే మహమ్మద్, మురిద్కే లష్కరే తోయిబా క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే, రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
ముఖ్యంగా భారత్ దాడులపై అంతర్జాతీయ మీడియా (Foreign Media) ఆసక్తి చూపింది. సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, బీబీసీ, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు.. ఈ దాడులను విస్తృతంగా తమ పత్రికల్లో కవరేజ్ చేశాయి. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)కు సంబంధించిన వార్తలను మినిట్ టు మినిట్ తమ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాయి. భారత్-పాకిస్థాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను కూడా ప్రస్తావించాయి. పెహల్గామ్ దాడి తర్వాత జరిగిన పరిణామాలు, ప్రస్తుత ఆపరేషన్ ఇలా ప్రతీదాన్ని సువివరంగా రాసుకొచ్చాయి. ‘పాక్‌పై భారత్ వైమానిక దాడులు’, ‘తొమ్మిది స్థావరాలపై భారత్ వైమానిక దాడులు’ వంటి హెడ్‌లైన్స్‌తో కథనాలను ప్రచురించాయి.
Also Read..
PM Modi | ఆపరేషన్ సిందూర్.. ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన రద్దు
Jaish-e chief | ఆపరేషన్ సిందూర్.. జైషే చీఫ్ మసూద్ కుటుంబం హతం