PM Modi | పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలతో (Paris Olympians) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) భేటీ అయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం మోదీ తన నివాసంలో క్రీడాకారులను కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించి ఘనంగా సన్మానించారు.
గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి షూటర్ మను భాకర్, సరజ్జోత్ సింగ్, పురుషుల హాకీ జట్టు సహా ఒలింపిక్స్ పతక విజేతలు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం వారంతా నేరుగా ప్రధాన మంత్రి అధికారిక నివాసానికి వెళ్లారు. అక్కడ మోదీతో భేటీ అయ్యారు.
ఈ భేటీ సందర్భంగా భారత పురుషుల హాకీ జట్టు (Hockey team) ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ప్రత్యేక బహుమతి అందజేసింది. ఆటగాళ్లంతా సంతకం చేసిన జెర్సీని గుర్తుగా అందజేసింది. కాగా, ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మొత్తం ఆరు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. భారత బృందం ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు సాధించింది. పతకాల పట్టికలో మన దేశం 71వ స్థానంలో నిలిచింది.
VIDEO | PM Modi (@narendramodi) meets Indian Olympic contingent at his residence in Delhi.
(Source: Third Party) pic.twitter.com/K2Gb5dzaCL
— Press Trust of India (@PTI_News) August 15, 2024
Also Read..
Turban | స్వాతంత్య్ర వేడుకల వేళ.. మరోసారి ప్రత్యేక తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ
PM Modi | ఎర్రకోట నుంచి సుదీర్ఘ ప్రసంగం.. మునుపటి రికార్డులను అధిగమించిన ప్రధాని మోదీ
PM Modi | మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలి : ప్రధాని మోదీ