PM Modi | దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై (crimes against women) ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలన్నారు. ఈ ఘటనల్లో త్వరితగతిన విచారణ జరిపి నిందితుల్ని శిక్షించాల్సిన (strictest punishment) అవసరం ఉందన్నారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ ఆసుపత్రిలో 31 ఏళ్ల మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈరోజు ఎర్రకోట నుంచి నా బాధను మరోసారి చెప్పాలనుకుంటున్నాను. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మనం తీవ్రంగా ఆలోచించాలి. మన తల్లులు, సోదరీమణులపై జరుగుతున్న దాడులపై ప్రజల్లో ఆందోళన ఉంది. దానిని నేను అర్థం చేసుకోగలను. దీన్ని దేశం, సమాజం, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలి. మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలి. నిందితులకు కఠిన శిక్షలు విధించాలి. ఇలా చేయడం సమాజంలో నమ్మకాన్ని పెంచుతుంది’ అని మోదీ పేర్కొన్నారు.
Also Read..
PM Modi | బంగ్లాదేశ్లో హిందువుల, మైనారిటీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయుల ఆందోళన : పీఎం మోదీ
PM Modi | ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.. సద్వినియోగం చేసుకోవాలి : ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi | భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం : ప్రధాని నరేంద్ర మోదీ