PM Modi | ఎర్రకోట నుంచి సుదీర్ఘ ప్రసంగం.. మునుపటి రికార్డులను అధిగమించిన ప్రధాని మోదీ
PM Modi | దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
PM Modi | దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అరుదైన ఘనతలు సాధించారు. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను మోదీ ఎగురవేశారు. అనంతరం ఎర్రకోట (Red Fort) నుంచి వరుసగా 11వ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తద్వారా పండిట్ జవహర్లాల్ నెహ్రూ (Pandit Jawaharlal Nehru) తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు. అంతేకాదు సుదీర్ఘ ప్రసంగం చేసి తన రికార్డును తానే అధిగమించారు (Longest Ever Speech).
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఇవాళ ఉదయం మోదీ 98 నిమిషాల పాటు జాతినుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. అంతకు ముందు 2016లో 96 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇప్పటి వరకూ అదే సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. తాజాగా ఆ రికార్డును మోదీ అధిగమించారు. ఇక మోదీ ప్రసంగాల్లో 2017దే అతిచిన్నది. ఆ ఏడాది కేవలం 56 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు.
మోదీ ప్రసంగాలు..
- 2014లో ప్రధాని బాధ్యతలు చేపట్టాక తొలిసారి మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అప్పుడు 65 నిమిషాల పాటు జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
- 2015లో దాదాపు 88 నిమిషాల పాటు ప్రసంగించారు.
- 2016లో 96 నిమిషాలు మాట్లాడారు. (మోదీ ప్రసంగాల్లో ఇప్పటి వరకూ ఇదే అతిపెద్దదిగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించారు).
- 2017లో దాదాపు 56 నిమిషాలు ప్రసంగించారు. ( ఇప్పటి వరకూ చేసిన ప్రసంగాల్లో ఇదే అతి చిన్నది).
- 2018లో 83 నిమిషాలు మాట్లాడారు.
- 2019లో 92 నిమిషాలు ప్రసంగించారు.
- 2020లో మోదీ ప్రసంగం 90 నిమిషాల పాటు కొనసాగింది.
- 2021లో 88 నిమిషాలు.
- 2022లో 74 నిమిషాలు.
- 2023లో 90 నిమిషాలు.
- 2024లో 98 నిమిషాలపాటూ ప్రసంగించారు. (ఇక మోదీ ప్రసంగాల్లో ఇదే అతిపెద్దది).
మోదీ కంటే ముందు..
1947లో జవహర్లాల్ నెహ్రూ, 1997లో ఐకే గుజ్రాల్ వరుసగా 72, 71 నిమిషాలు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ కూడా 1954 , 1966లో వరుసగా 14 నిమిషాల పాటు అతి తక్కువ ప్రసంగాలు చేశారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఎర్రకోట నుంచి అతి తక్కువ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు చేశారు. 2012, 2013లో మన్మోహన్ సింగ్ ప్రసంగాలు వరుసగా 32, 35 నిమిషాలు మాత్రమే సాగాయి. 2002, 2003లో వాజ్పేయి ప్రసంగాలు 25, 30 నిమిషాల కంటే తక్కువగా ఉన్నాయి.
Also Read..
PM Modi | మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలి : ప్రధాని మోదీ
PM Modi | బంగ్లాదేశ్లో హిందువుల, మైనారిటీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయుల ఆందోళన : పీఎం మోదీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

