Onam Festival : ఓనమ్‌కు ఆంక్షలు సడలించిన పినరయి ప్రభుత్వం
Onam Festival : ఓనమ్ పండుగకు రేపటి నుంచి కొవిడ్ సడలింపులు అమలులో ఉంటాయని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది

తిరువనంతపురం : బక్రీద్ పండుగ సందర్భంగా కొవిడ్ ఆంక్షల సడలింపు వివాదానికి దారితీసిన తర్వాత.. ఇప్పుడు ఓనమ్ పండుగకు కూడా అలాంటి నిర్ణయమే కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం తీసుకున్నది. ఓనమ్ పండుగకు (Onam Festival) రేపటి నుంచి కొవిడ్ సడలింపులు అమలులో ఉంటాయని కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఓనమ్ పండుగకు ఆంక్షలు సడలింపు ప్రకటించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది. బక్రీద్ పండుగకు కొవిడ్-19 ఆంక్షలను సడలించడంపై సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర మంత్రులు కూడా విభేదించారు.
దేశంలోని మొత్తం కేస్లోడ్లో 49.85 శాతం కేరళ రాష్ట్రం నుంచే నమోదయ్యాయి.రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడారు. ఎన్డీసీసీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ బృందం కేరళ నుంచి తిరిగి వచ్చి నివేదికను సమర్పించింది. కేరళలో కొనసాగుతున్న పరిస్థితులను నియంత్రించడానికి మరింత చురుకైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలంటూ విజయన్‌కు లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి మాండవియా ట్విట్టర్లో రాశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12 న ప్రారంభమై 23 వ తేదీన ముగియనున్న ఓనమ్ పండుగ సందర్భంగా కొవిడ్ ఆంక్షలను సడలిస్తూ పినరయి విజయన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, దుకాణాలు, మార్కెట్లు, బ్యాంకులు, కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమలు, బహిరంగ పర్యాటక ప్రాంతాలు వారంలో సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులు పనిచేస్తాయి. దుకాణాల వద్ద రద్దీని నియంత్రించేందుకు అన్ని దుకాణాలు, ఇతర సంస్థలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి. తాజా సడలింపులు ఆగస్టు 5 నుంచి అమలులోకి వస్తాయి.
అయితే, పాఠశాలు, కాలేజీలు, సినిమా హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మూసి ఉంటాయి. ఆన్లైన్ డెలివరీ నిమిత్తం మాల్స్‌కు అనుమతించారు. ఆన్లైన్ విద్యాబోధన కోసం పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ప్రార్థనా స్థలాల్లోకి అనుమతించే గరిష్ట వ్యక్తుల సంఖ్యను 40 కి పరిమితం చేయాలని ఆదేశించారు. ఆదివారాలు వ్యాపార సంస్థలు మూసి ఉండాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొనగా.. ఈ నెల 15 నుంచి 23 వరకు ఆదివారాల్లో కూడా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలు తెరిచే ఉంటాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి చెప్పడం కొసమెరుపు.
ఇవి కూడా చదవండి..
రూ.6,504 కోట్ల లాభాన్ని ఆర్జించిన ఎస్బీఐ
అనాథల సంక్షేమ చట్టాల అమలు చూడండి: వెంకయ్యనాయుడు
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఉచితం
బిల్లుకు మద్దతు తెలిపి ఇప్పుడు ఆందోళనలా?
రక్షణ మంత్రి టార్గెట్‌గా కార్ బాంబు దాడి
ఆసియా తొలి న్యూక్లియార్ రియాక్టర్ ప్రారంభం
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

