Venkaiah Naidu : అనాథల సంక్షేమ చట్టాల అమలు చూడండి: వెంకయ్యనాయుడు
Venkaiah Naidu : బాలల న్యాయ చట్టం (జువెనైల్ జస్టిస్) విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను భారతదేశం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాగతించారు. సవరణలు చేసిన ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా, ప్రభావవంతంగా అమలుచేయాలని ఆయన సూచించారు

న్యూఢిల్లీ: బాలల న్యాయ చట్టం (జువెనైల్ జస్టిస్) విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను భారతదేశం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) స్వాగతించారు. సవరణలు చేసిన ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా, ప్రభావవంతంగా అమలుచేయాలని ఆయన సూచించారు. బుధవారం కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్య నాయుడును కలిశారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, అనాథల సంక్షేమానికి సంబంధించి ఇటీవలి కాలంలో తమ దృష్టికి వచ్చిన అంశాలు, వివిధ విజ్ఞప్తులను కేంద్ర మంత్రికి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
బాలల న్యాయ చట్టంలోని ప్రత్యేకమైన అంశాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వివరించారు. తాజా సవరణల ప్రకారం అనాథ పిల్లలకు సరైన సంరక్షణ అందించే ప్రయత్నం, వారి దత్తతకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరిగే మార్పులను మరింత వేగవంతంగా, పకడ్బందీగా అమలుచేసేలా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు విశేషమైన అధికారాలు కట్టబెడుతున్నదని ఆమె తెలిపారు. అలాగే, అనాథలకు పునరావాసం కల్పించేందుకు ఉద్దేశించిన వివిధ కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపడుతున్న తీరును కూడా వివరించి చెప్పారు.
అనాథ పిల్లలు ఇబ్బందులు పడకూడదనేదే తమ ఆకాంక్ష అని ఉపరాష్ట్రపతి అన్నారు. వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు కూడా తోడురావాలని, అప్పుడే వారి సంరక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలు మరింత సమర్థంగా అమలయ్యేందుకు వీలవుతుందన్నారు. తెలంగాణకు చెందిన ఎంపీ బండా ప్రకాశ్ ఇటీవల అనాథ పిల్లలతో కలిసి ఉపరాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనాధల సమస్యలను వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకువచ్చారు. అదేరోజున కేంద్ర రక్షన మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్‌షాతో కూడా వెంకయ్య మాట్లాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SIR | ఆధార్‌కు బదులు ఓటర్ ఐడీ.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సర్ ఎసరు?
Walking | ట్రెడ్‌మిల్‌పై నడవడమా? పార్కుల్లో వాకింగా? ఏది బెటర్?
IND vs NZ ODI | భారత్-కివీస్ తొలి వన్డేకు వరుణుడి బ్రేక్.. వర్షంతో ఆలస్యమైన టాస్
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

