కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్!
ఎల్ నినో ఎఫెక్ట్‌తో రాష్ట్రం లో నీటి కటకట తారస్థాయికి చేరింది. ప్ర త్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌లో సంక్షో భం ముదిరింది. ముఖ్యంగా కాలేజీలు, హాస్టళ్లలో నీటి ఎద్దడి తీవ్రమైంది.
- విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ కాలేజీ
- ఇదే దారిలో ధనిక్భారత్, శ్రీచైతన్య విద్యాసంస్థలు
- మాదాపూర్‌లోని క్యాంపస్‌లకు దీపావళి వరకు హాలిడేస్
- సెలవు రోజుల్లో ఆన్లైన్ క్లాసులు – రీ ఓపెన్పైనా సందిగ్ధం
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఎల్ నినో ఎఫెక్ట్‌తో రాష్ట్రం లో నీటి కటకట తారస్థాయికి చేరింది. ప్ర త్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌లో సంక్షో భం ముదిరింది. ముఖ్యంగా కాలేజీలు, హాస్టళ్లలో నీటి ఎద్దడి తీవ్రమైంది. ఈ నీటి సంక్షోభం నేపథ్యంలో మాదాపూర్‌లోని శ్రీచైతన్య, నారాయణ, ధనిక్భార త్ ఐఐటీ అకాడమీలకు, రెసిడెన్షియల్ క్యాంపస్‌లకు దీపావళి సెలవులిస్తూ మంగళవారం సర్క్యులర్ జారీచేశారు. బుధవారం ఉదయమే ఇండ్లకు వెళ్లిపోవాలని సూచించారు. ఇవేగాక మాదాపూర్, అయ్యప్ప సొసైటీలోని నారాయణ విద్యాసంస్థలకు చెందిన 10 క్యాంపస్లకూ సె లవులు ప్రకటించారు. మరికొన్ని క్యాంపస్‌లకు సెలవులిచ్చే దిశలో యాజమాన్యం ఆలోచన చేస్తున్నది. ధనిక్భారత్, శ్రీచైతన్య విద్యాసంస్థల్లో విద్యార్థులకు హోం సిక్ హాలిడేస్ ఇవ్వగా.. విద్యార్థులు ఇప్పటికే ఇండ్లకు వెళ్లిపోయారు.
రీ ఓపెన్‌పై సందిగ్ధం
సెలవుల తర్వాత కాలేజీల రీ ఓపెన్‌పై సందిగ్ధం నెలకొన్నది. దీపావళి పండుగ తర్వాత సమాచారం చేరవేస్తామని యా జమాన్యాలు చెప్తున్నాయి. ఈ సెలవుల్లో ప్రతిరోజూ ఆన్లైన్ క్లాసులకు హాజరుకావాలని సూచిస్తున్నాయి. మాదాపూర్‌లోని విద్యాసంస్థల హాస్టళ్లలో తాగునీరు, స్నానాలు, రోజు వారీ అవసరాలు, టిఫి న్, భోజనం వంట చేసేందుకు నీళ్లు ఉం డాల్సిందే. ఇదివరకు ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడగా.. ఇటీవలి కాలంలో ట్యాంకర్లపై అధికారులు కొరడా ఝులిపిస్తుండటంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ఓ కాలేజీకి రోజుకు 4ట్యాంకర్లు అవసరం కాగా, రెండు రోజులైనా ఒక్కటీ రాని పరిస్థితులున్నాయి. దీంతో యాజమాన్యాలు స్టళ్లు నడుపలేక.. ఆన్లైన్ క్లాసుల పేరిట విద్యార్థులను ఇంటిబాట పట్టిస్తున్నాయి.
ప్రైవేట్ హాస్టళ్లు కూడా..
ప్రైవేట్ హాస్టళ్లు కూడా నీటి కష్టాలు తప్పడం లేదు. ఇన్నాళ్లు ట్యాంకర్లపై ఆధారపడ్డ హాస్టళ్లు నీటి సరఫరా తగ్గడంతో విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. నీటి కొరతతో నిర్వహణ భారంగా మారుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

