Jasprit Bumrah | టెస్టుల్లో బుమ్రా అరుదైన రికార్డు.. అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్-10 భారత బౌలర్ల జాబితాలో చోటు..!
Jasprit Bumrah | భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్-10 భారత బౌలర్ల జాబితాలో అతను చోటుదక్కించుకున్నాడు. ఇప్పటికే 10వ స్థానంలో ఉన్న జవగల్ శ్రీనాథ్ (236 వికెట్లు) ను వెనక్కు నెట్టి పదో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో 619 వికెట్లతో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు.
Jasprit Bumrah : భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్-10 భారత బౌలర్ల జాబితాలో అతను చోటుదక్కించుకున్నాడు. ఇప్పటికే 10వ స్థానంలో ఉన్న జవగల్ శ్రీనాథ్ (236 వికెట్లు) ను వెనక్కు నెట్టి పదో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో 619 వికెట్లతో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (537), కపిల్‌దేవ్ (434) రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
అటు భారత పేసర్ల జాబితాలోనూ జవగల్ శ్రీనాథ్‌ను ఐదో స్థానానికి నెట్టి బుమ్రా నాలుగో స్థానంలోకి వచ్చాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్ (434) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత జహీర్ ఖాన్ (311), ఇషాంత్ శర్మ (311) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్‌తో ఇవాళ మొదలైన తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తన ఖాతాలో మూడో వికెట్ వేసుకోవడం ద్వారా బుమ్రా ఈ ఘనత సాధించాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్ వేదికగా ఇవాళ తొలి టెస్ట్ ప్రారంభమైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్ తరఫున బుమ్రా మూడు వికెట్లతోపాటు అన్షుల్ కంబోజ్, ఆకాశ్‌దీప్ చెరో వికెట్ తీయడంతో న్యూజిలాండ్ జట్టు 70 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయమైన 157 పరుగులు జోడించారు. 77 ఓవర్ల ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 227 పరుగులతో కొనసాగుతున్నది. హెన్రీ నికోల్స్ 103, గ్లెన్ ఫిలిప్స్ 88 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jasprit Bumrah | టెస్టుల్లో బుమ్రా అరుదైన రికార్డు.. అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్-10 భారత బౌలర్ల జాబితాలో చోటు..!
Ramayana | రూ. 1,500 కోట్ల క్లబ్లో ‘రామాయణం’.. 14 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర!
MDMA drugs | ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్.. మరో నిందితుడు పరారీ
ENE Repeat Review | ‘ఈఎన్ఈ రిపీట్’ రివ్యూ: స్నేహం, సినిమా పిచ్చితో మరోసారి నవ్వించిన గ్యాంగ్!
NRI | దీక్షా దివస్ స్ఫూర్తి కొనసాగుతుంది : నాగరాజు గుర్రాల
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

