కాంగ్రెస్ మంద బుద్ధితోనే దుర్భిక్షం
ఏ ప్రభుత్వాలైనా తమ ఏలుబడిలో ప్రజలు సుఖశాంతులతో బతకాలని కోరుకోవాలి. కరువు కాటకాలను ముందుగానే అంచనా వేయాలి. నదులు, చెరువులు, కుంటలను అనుసంధానం చేస్తూ ప్రతి వర్షపు బొట్టునూ నిలువ చేయాలి. అప్పుడే ఆ రాష్ట్రం పాడిపంటలతో తులతూగుతుంది.
ఏ ప్రభుత్వాలైనా తమ ఏలుబడిలో ప్రజలు సుఖశాంతులతో బతకాలని కోరుకోవాలి. కరువు కాటకాలను ముందుగానే అంచనా వేయాలి. నదులు, చెరువులు, కుంటలను అనుసంధానం చేస్తూ ప్రతి వర్షపు బొట్టునూ నిలువ చేయాలి. అప్పుడే ఆ రాష్ట్రం పాడిపంటలతో తులతూగుతుంది. ప్రస్తుత ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రం తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నదని ప్రకటించిన పాలకులు, పరిస్థితులను ఎదుర్కోవడానికి ముందే సంసిద్ధులు కాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. దేశంలో సింధు నాగరికత నుంచి చెరువులు తవ్వి నీటిని నిల్వ చేసే బృహత్తర కార్యక్రమాలు మొదలయ్యాయి. కానీ ఈ ఆధునిక యుగంలో ఇక్కడి పాలకుల ముందు చూపులేని మందబుద్ధితో రైతులు, ప్రజలు కరువు కోరల్లోకి జారుకునే దుస్థితి దాపురించింది.
శాస్త్ర సాంకేతిక రంగం ఉనికిలోనే లేని కాలంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన ప్రసిద్ధ రాజవంశం చోళ రాజులు (క్రీ.శ 850-1270) తమ పాలనలో వ్యవసాయానికి పెద్దపీట వేశారు. నీటిపారుదల, కాలువల నిర్మాణం, చెరువులు, కుంటలు తవ్వి వర్షపు నీటిని ఒడిసిపట్టి కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలో హరిత విప్లవాన్ని సృష్టించారు. ప్రజలు సుఖశాంతులతో బతికేలా కృషి చేశారు. ఆ రోజుల్లోనే పాలకులు ప్రజల పట్ల ఎలా ఉండాలో, ఏం చేయాలో చేసి చూపారు. కాకతీయుల కాలం (క్రీ.శ 12-14 శతాబ్దాలు)లో వ్యవసాయం ప్రజల జీవనాధారం. నాటి పాలకులు స్థానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా గొలుసుకట్టు చెరువుల నిర్మాణం చేపట్టారు.
గ్రామీణ ప్రాంతాలు సిరిసంపదలతో తులతూగేలా చేశారు. చెరువుల నిర్మాణం ఒక ధర్మ కార్యంగా భావించారు. అలాంటిది ఇంత అభివృద్ధి చెందిన కాలంలో పాలకులు ఎలా ఉండాలి? ముందుచూపుతో ఎలా వ్యవహరించాలి? వీటికి మాత్రం ప్రస్తుత పాలకుల తీరు చూస్తే సమాధానం దొరుకని పరిస్థితి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అంటేనే గుట్టలు, రాళ్లు, నీటి లభ్యత లేని నెర్రెలుబారిన నేలలు గుర్తుకు వచ్చేవి. కానీ ఆంధ్రా పాలకుల పీడన నుంచి 2014 జూన్ 2న స్వరాష్ట్రం సాధించుకున్నాం. ఆ తర్వాత ఏర్పడ్డ మొదటి ప్రభుత్వంలో చోళులు, కాకతీయుల పాలనను గుర్తుకు తెచ్చేలా ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాలనే పట్టుదలతో ప్రాజెక్టులు, కుంటలు, చెరువులు, కాలువల నిర్మాణానికి ఒక భగీరథ ప్రయత్నమే జరిగింది.
గతకాలపు కరువును చూసిన అనుభవంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముందుగానే సాగు, తాగు నీటి వనరుల అభివృద్ధిపై దృష్టి సారించారు. తెలంగాణలోని సంప్రదాయ చెరువులను పునరుద్ధరించారు. వర్షపు నీటిని స్థానికంగా నిల్వ చేసుకోవాలనే లక్ష్యంతో చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజల నీటి అవసరాలు తీర్చడమే పరమావధిగా ముందడుగు పడింది.
చెరువుల పూడిక తీయడం, చెరువు కట్టలు, తూములు, మత్తడుల మరమ్మతులు, చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచడం, సాగునీరు అందించే కృషి నిర్విఘ్నంగా జరిగింది. కానీ 2023లో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తన తెంపరితనంతో కూడిన పాలనతో రాష్ర్టానికి అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నది. కరువు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికలు రచించకుండా ప్రజలను నట్టేట ముంచుతున్నది.
ఎల్ నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య రాష్ట్రంలో మొత్తం 621 మండలాలకు గాను, 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులో 111 మండలాలను తీవ్ర కరువు ప్రాంతాలుగా, 254 మండలాల్లో మధ్యస్థ కరువు ఉంటుందని తెలిపింది. ఇక కరువు మండలాల ప్రకటనలో కూడా వివక్ష చూపుతున్నారని, ఇంకా చాలా మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉన్నా, ఉద్దేశపూర్వకంగా వదిలేశారని ప్రతిపక్షాలు మండిపడుతూ ఆందోళనలు చేస్తున్నాయి. అసలు వర్షాభావ పరిస్థితులు రాకమునుపే పాలకులు మెళకువగా వ్యవహరిస్తే బాగుండేది. కృష్ణా, గోదావరి బేసిన్లో సమృద్ధిగా నీటిని వినియోగించుకుని ఉంటే ఇప్పుడు రాష్ర్టానికి ఈ దుస్థితి ఎదురయ్యేది కాదు.
తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 79 శాతం ప్రాంతం గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్నది. రాష్ట్రంలో సుమారు 450 కిలోమీటర్ల దూరం ప్రవహించే గోదావరి నదిపై మన ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. బీడువారిన నేలల్లో రత్నాలు పండించింది. కానీ రాష్ర్టానికి జీవనాధారం లాంటి ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం ఏం చేస్తున్నది? రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ పని చేస్తున్నదా? రాష్ట్ర ఆనకట్టల భద్రతా కమిటీ ఎందుకు ఉన్నట్టు? వేల క్యూసెక్కుల నీరు వృథాగా ఆంధ్రాకు తరలిపోతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న ప్రభుత్వ పెద్దలను ఎందుకు ప్రశ్నించకూడదు? రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేసి గత ఒరవడిని కొనసాగించాల్సిన ప్రస్తుత పాలకులు దాన్ని విస్మరించడం బాధాకరం.
ప్రభుత్వం ప్రజల బాగుకోసం నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి పెట్టి, వాటిని సమర్థవంతంగా నిర్వహించాలి. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులను ప్రశ్నార్థకం చేస్తూ, గత పాలకుల ఆనవాళ్లను చేరిపి వేసే దుష్ట ప్రయత్నంలో, ప్రజా ప్రయోజనాలను గాలికి వదలడం సరికాదు. ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడం విడ్డూరం.
అదీకాక తెలంగాణ నీటి అవసరాలను తీర్చే ఆనకట్టలను నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శ కూడా ఉన్నది. ప్రభుత్వం తక్షణమే ఎన్డీఆర్ఎఫ్ నిధులను కోరాలి. ఉపాధి హామీ పథకం (జీ రామ్ జీ) ద్వారా ఎక్కువ పనిదినాలు కల్పించి, ఉపాధి కోల్పోయిన గ్రామీణ ప్రజలు, రైతులను ఆదుకోవాలి. దీనికి తోడు పట్టణ, పల్లె ప్రాంతాల్లో ట్యాంకర్లతో తాగు నీరు, పశుగ్రాసం ఏర్పాటు చేయాలి. కరువును జయించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. అయితే రాష్ట్రంలో ఇప్పటికే 24శాతం లోటు వర్షపాతం నమోదవగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు ఎంత వరకు పెరుగుతాయి అనేది వేచిచూడాలి.
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

